అందుకే దుబ్బాకలో మేము ఓడిపోతున్నాం: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్
- దుబ్బాక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సొంత మండలాలు
- కాంగ్రెస్‌కి చాలా టఫ్ నియోజక వర్గం
- ఫలితాలను ముందే ఊహించాం
- ఇంత తక్కువ ఓట్లు వస్తాయని మాత్రం అనుకోలేదు
దుబ్బాక నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంలో అతి తక్కువ ఓట్లతో కొనసాగుతోంది. తమ పార్టీ ఓటమి దిశగా పయనిస్తుండడంతో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సొంత మండలాలని చెప్పారు. కాంగ్రెస్‌కి చాలా టఫ్ నియోజక వర్గం ఇదని చెప్పారు. ఫలితాలను తాము ముందే ఊహించామని, అయితే, తమ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు వస్తాయని అనుకోలేదని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మూడుసార్లు ఓడిపోయారనే సానుభూతి అక్కడ ఉందని తెలిపారు.
మరోవైపు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత భర్త పోయారనే సానుభూతి ప్రజల్లో ఉందని సంపత్ కుమార్ చెప్పారు. దీంతో దుబ్బాకలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న నేతలను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ విజయవంతమైందని చెప్పారు.