దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తోన్న బీజేపీ.. నాలుగో రౌండ్ లోనూ రఘునందన్‌రావు దూకుడు
- నాలుగు రౌండ్ల తర్వాత 2,684 ఓట్ల ఆధిక్యం
- ఇప్పటికి బీజేపీకి 13,055 ఓట్లు
- టీఆర్ఎస్‌కి 10,371.. కాంగ్రెస్‌కి 2,158 ఓట్లు
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్ ఇచ్చేలా ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉండడం గమనార్హం. బీజేపీ 13,055, టీఆర్ఎస్ 10,371, కాంగ్రెస్ 2,158 ఓట్లతో ఉన్నాయి.
అంతకుముందు మూడో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. టీఆర్ఎస్ కంటే 1,885 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ మూడో రౌండ్‌లో నిలిచి, నాలుగో రౌండ్‌లో మరింత దూకుడు కనబర్చారు. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.