మధ్యప్రదేశ్‌లో 18 స్థానాల్లో బీజేపీ ముందంజ
- బీహార్‌లో మహాఘట్‌బంధన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఆధిక్యం
- మధ్యప్రదేశ్‌లోని పలు స్థానాల్లో ముందంజలో బీజేపీ అభ్యర్థులు
- కాంగ్రెస్ 8, బీఎస్పీ 2 స్థానాల్లో ఆధిక్యం
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాఘట్‌బంధన్ దూసుకుపోతుండగా, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది.
ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం బీజేపీ 18, కాంగ్రెస్ 8, బీఎస్పీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సాంవెర్ నుంచి పోటీ చేసిన తులసీరామ్ సిలావట్, గ్వాలియర్ నుంచి పోటీ చేసిన ప్రద్యేమ్నసింగ్, అనూప్‌పూర్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన బిసాహూలాల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.