ఊహించని విజయం బీజేపీకి దక్కేలా వుంది: రామ్ మాధవ్ ట్వీట్
- మూడవ రౌండ్ లోనూ బీజేపీకి ఆధిక్యం
- ప్రస్తుతం 1,259 ఓట్ల ఆధిక్యంలో రఘునందన్ రావు
- ఆసక్తికర పోరుకు దుబ్బాక వేదికైందన్న రామ్ మాధవ్
దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలి మూడు రౌండ్లలోనూ బీజేపీ నేత రఘునందన్ రావుకు ఆధిక్యం రావడంపై ఆ పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికర పోరుకు దుబ్బాక ఉప ఎన్నిక వేదికైంది. బీజేపీ ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. అనుకోని విజయం బీజేపీకి దక్కేలా ఉంది" అని ఆయన అన్నారు.
కాగా, ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి రఘునందన్ రావు 1,250కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతకు 7,964 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 9,223 ఓట్లు లభించాయి. మూడవ రౌండ్ లో రఘునందన్ రావుకు 129 ఓట్ల ఆధిక్యం లభించింది.