దుబ్బాకలో దూసుకెళ్తున్న బీజేపీ.. రెండో రౌండ్‌లోనూ రఘునందన్‌రావుకే ఆధిక్యం
- జోరుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు
- 615 ఓట్ల ఆధిక్యంలో రఘునందన్‌రావు
- బరిలో 23 మంది అభ్యర్థులు
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రెండు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 615 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో ఆయనకు 3,208 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 2,867, కాంగ్రెస్‌కు 648 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్‌కు 1,282 ఓట్లు వచ్చాయి.
సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,64,192 మంది ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు.