దుబ్బాకలో కొనసాగుతున్న లెక్కింపు.. తొలి రౌండ్‌లో రఘునందన్‌రావు ఆధిక్యం
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- తొలి రౌండ్‌లో 341 ఓట్ల ఆధిక్యం
- పోలింగ్ కేంద్రం వద్దకు రఘునందన్‌రావు
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగుతుండగా, తొలుత పోస్టల్ ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఆధిక్యం లభించింది. ఆయన 341 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పోస్టల్ ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బయటి నుంచి పరిస్థితిని అంచనా వేస్తూ వెళ్లిపోయారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.