హోరాహోరీ ఖాయమనేలా బీహార్ తొలి ట్రెండ్స్!
- 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
- ఎన్డీయే 14, ఎంజీబీ 25 స్థానాల్లో ముందంజ
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే తొలి ట్రెండ్స్
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ ఉదయం 8 గంటల తరువాత తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది, ఆపై ఈవీఎంలను తెరిచారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్డీయే 14 స్థానాల్లో ముందంజలో ఉండగా, మహా ఘటబంధన్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ), బీజేపీ కలిసి ఓ కూటమిగా, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ - కాంగ్రెస్ మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ పడిన సంగతి తెలిసిందే. ఎన్నికలు హోరాహోరీగా సాగాయని, కాస్తంత మొగ్గు మహా ఘటబంధన్ వైపే ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. అందుకు అనుగుణంగానే ఫలితాల తొలి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.