మనవడు హిమాన్షుకి తప్ప కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి: బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు
- తెలంగాణలో నిరుద్యోగంపై స్పందించిన లక్ష్మణ్
- పరీక్షలో ఫెయిలైన కవితకు కూడా ఉద్యోగమిచ్చారని వ్యంగ్యం
- తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం
తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. మనవడు హిమాన్షుకు తప్ప కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. పరీక్షలో ఫెయిలైన కవితకు కూడా ఇటీవలే ఉద్యోగమిచ్చారని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చూస్తుంటే మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చావంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ప్రస్తుతం సీఎం ఇంట్లో మనవడు హిమాన్షు ఒక్కడే ఖాళీగా ఉన్నాడని అన్నారు.
తండ్రీకొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాదని వర్రీయింగ్ ప్రెసిడెంట్ అని అభివర్ణించారు. మజ్లిస్ తో జట్టుకట్టి హైదరాబాద్ ను నాశనం చేశారని మండిపడ్డారు. ఇటీవల వరదల నేపథ్యంలో, రాష్ట్రానికి సముద్రం లేదన్న బెంగను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో రోడ్లు బాగుపడేంత వరకు ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు.