విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చిన ఘనత కేటీఆర్‌దే: బీజేపీ నేత లక్ష్మణ్
- కిషన్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు
- హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది
- ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి సిద్ధం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ నేత కె.లక్ష్మణ్ స్పందస్తూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలు సరికాదన్నారు. విశ్వనగరాన్ని విషాద నగరంగా మార్చిన ఘనత కేటీఆర్‌దే నని విమర్శించారు. హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
దీనిపై చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా? అని సవాలు విసిరారు. రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక తమపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. నాడు నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని, అందుకే మేనేజ్‌మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు.