జైలులో శిక్ష అనుభవిస్తూ 31 డిగ్రీలు.. విడుదలయ్యాక మరో 23 డిగ్రీలు సంపాదించిన వ్యక్తి!
- అహ్మదాబాద్ వాసి భానుభాయ్ స్ఫూర్తిమంతమైన జీవితం
- జైలు నుంచే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన పటేల్
- మొత్తం 54 డిగ్రీలు అందుకున్న వైనం
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు పలు రికార్డులు సొంతం
జైలు జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. స్వాతంత్య్రపోరాటంలో జైలుకి వెళ్లిన వారు కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జైలులోనే అనేక పుస్తకాలను రాశారు. అహ్మదాబాద్‌కు చెందిన భానుభాయ్ పటేల్ అనే వ్యక్తి కూడా జైలు జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఏకంగా 31 డిగ్రీలు పూర్తి చేయడం గమనార్హం. అంతేకాకుండా జైలు నుంచే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు.
అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత ఉన్నత విద్య కోసం 1992లో భానుభాయ్ పటేల్ (50) అమెరికాకు వెళ్లారు. అయితే, అమెరికాలో ఓ నగదు లావాదేవీ విషయంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఫెరా) ను ఆయన ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. న్యాయస్థానం 10 సంవత్సరాల జైలుశిక్ష విధించి, అహ్మదాబాద్ జైలుకు పంపింది.
ఈ కాలంలోనే మరింత చదివి, 31 డిగ్రీలు అందుకున్నారు. జైలు నుండి విడుదలయ్యాక అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు ఉద్యోగం వచ్చింది. అసలు జైలుకు వెళ్లిన వ్యక్తికి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం రాదు. అయినప్పటికీ, పటేల్ ఏకంగా 31 డిగ్రీలు అందుకుని, క్రమశిక్షణతో ఉండడంతో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అనంతరం కూడా ఆయన చదువుని ఆపలేదు.
ఐదేళ్లలో మరో 23 డిగ్రీలు అందుకున్నాడు. వీటితో కలిపి మొత్తం 54 డిగ్రీలు అందుకున్న వ్యక్తిగా ఆయన ఇటీవలే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనివర్సల్ రికార్డ్ ఫోరం, వరల్డ్ రికార్డ్ తో పాటు మరికొన్ని రికార్డులు ఆయన సొంతమయ్యాయి.