తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

  • తక్కువ ఎత్తున వీస్తున్న గాలులు
  • మన్యంలో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
  • కోస్తాలో పొడి వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లోకి చలికాలం ప్రవేశించింది. ఈశాన్య గాలులు చాలా తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా, ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

విశాఖ మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోగా, మిగతా ప్రాంతాల్లో 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో కాస్తంత పొడి వాతావరణం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా రానున్న రెండు రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేశారు.


More Telugu News