పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు ప్రారంభించాం: మంత్రి అవంతి
- ఇటీవలే ఏపీ స్కూళ్లు పునఃప్రారంభం
- పలు స్కూళ్లలో కరోనా కలకలం
- విద్యార్థులను బలవంతంగా రప్పించడంలేదన్న అవంతి
ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభించిన నేపథ్యంలో పలు స్కూళ్లలో కరోనా కలకలం రేగడం తెలిసిందే. 575 మంది విద్యార్థులు, 829 మంది టీచర్లు కరోనా బారినపడినట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఆన్ లైన్ క్లాసులు వినేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ సౌకర్యంలేని పేద పిల్లల కోసమే స్కూళ్లు తెరిచామని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థుల హాజరు తప్పనిసరేమీ కాదని వివరించారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలో, వద్దో తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలివేశామని అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం ఉంటేనే పిల్లలు స్కూళ్లకు రావొచ్చని, తామేమీ బలవంతంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడంలేదని వ్యాఖ్యానించారు.