నిన్న నా మేనకోడలు కమలాహారిస్‌కి ఫోను చేసి ఈ విషయం చెప్పాను: మేనమామ గోపాలన్
- మీడియాతో మాట్లాడిన ఢిల్లీకి చెందిన గోపాలన్
- నా మేనకోడలు గెలుస్తుందని ముందే చెప్పాను
- గెలవాలని మనమందరం కోరుకున్నాం
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా విజయం సాధించిన డెమోక్రాటిక్ అభ్యర్థులు జో బైడెన్, కమలాహారిస్‌లకు భారతీయుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కమలాహారిస్ మేనమామ, ఢిల్లీలో స్థిరపడ్డ గోపాలన్ బాలచంద్రన్ తన మేనకోడలి విజయంపై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. తన మేనకోడలు గెలుస్తుందని తాను ముందే చెప్పానని అన్నారు.
ఈ ఎన్నికల్లో జో బైడెన్, కమలాహారిస్ గెలవాలని మనమందరం కోరుకున్నామని గోపాలన్ చెప్పారు. కమలాహారిస్‌తో తాను నిన్న మాట్లాడానని తెలిపారు. ఆమె విజయం సాధించబోతుందని ఆమెతో అన్నానని చెప్పారు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఎన్నికై ఆ పదవి చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళగా, ఆసియన్-అమెరికన్‌గా ఆమె నిలిచారు. కాగా, కమలాహారిస్ విజయం సాధించడంతో ఆమె తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరైన తమిళనాడులోని తులసేంద్రపురంలో స్థానికుల సంబరాలు అంటరాన్నంటాయి.