ఊహించని సర్ ప్రయిజ్ ఇచ్చిన 'బిగ్ బాస్'... తెలుగు తెరపై తమిళ షో!

  • కమల్ హాసన్ ను వర్చ్యువల్ గా తెచ్చిన నాగ్
  • తన హౌస్ మేట్స్ ను పరిచయం చేసిన కమల్
  • కమల్ ను తమిళంలో పలకరించిన నాగార్జున
టాలీవుడ్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ షోలో, వీక్షకులకు ఊహించని సర్ ప్రయిజ్ గత రాత్రి లభించింది. తెలుగు తెరపై తమిళ షో కనిపించింది. తెలుగులో బిగ్ బాస్ ను నాగార్జున హోస్ట్ చేస్తుండగా, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తెలుగు షోతో పోలిస్తే, కాస్తంత ఆలస్యంగా తమిళ షో మొదలైంది.

దీంతో తమిళ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లతో కళకళలాడుతుండగా, నాగ్ తో మాట్లాడిన కమల్ హాసన్, తన షోలోని ప్రతి ఒక్కరినీ పరిచయం చేశారు. ఓ స్పెషల్ ఈవెంట్ గా శనివారం నాటి కార్యక్రమం సాగగా, వర్చ్యువల్ గా కమల్ హాసన్ ను చూసిన తెలుగు కంటెస్టెంట్లు ఆనందంతో గంతులేశారు. ఇక, కమల్ తెలుగులో నాగ్ ను పలకరించగా, నాగ్ తమిళంలో మాట్లాడటం గమనార్హం.

ఇద్దరు హోస్ట్ లూ ఒకరి షో కంటెస్టెంట్లను మరొకరు పరిచయం చేస్తూ, సందడి చేశారు. ఇక నాగ్ మాట్లాడుతూ, మీ హౌస్ ఫుల్ గా ఉందండీ అనగా, హౌస్ ఫుల్ అనే మాట తనకు ఇష్టం లేని మాటని కమల్ చెప్పేశారు. తెలుగు కంటెస్టెంట్లు బాగా ఆడుతున్నారని కితాబిచ్చిన కమల్ వెళ్లిపోయిన తరువాత, నాగ్ తనదైన శైలిలో హౌస్ మేట్స్ తో ఆటలాడించారు. ఇక నేడు హౌస్ లో మరో ఎలిమినేషన్ జరగనుందన్న సంగతి తెలిసిందే.



More Telugu News