తిరుపతిలో 24 గంటలూ ఉచిత దర్శన టోకెన్ల జారీ!
- విష్ణు నివాసంలో ప్రత్యేక కౌంటర్
- స్లాట్స్ ఆధారంగా టికెట్ల జారీ
- భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్న టీటీడీ
తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విష్ణు నివాసంలో ఇకపై 24 గంటలూ స్వామివారి ఉచిత దర్శన టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక కౌంటర్ ను అధికారులు ప్రారంభించారు. ఇటీవలి వరకూ అలిపిరి వద్ద ఉన్న భూదేవీ కాంప్లెక్స్ లో పరిమిత సమయం మాత్రమే ఉచిత దర్శన టోకెన్లు జారీ అవుతుండగా, ఇకపై విష్ణు నివాసంలోనూ లభ్యం కానున్నాయి.
కరోనా కారణంగా మార్చిలో భక్తులకు దర్శనాలను నిలిపివేసిన దాదాపు ఆరు నెలల తరువాత, తిరిగి దర్శనాలను ప్రారంభించగా, ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను కూడా పెంచాలని నిర్ణయించామని, కొండపై రద్దీ, అందుబాటులో ఉన్న స్లాట్స్ ఆధారంగా ఇక్కడ దర్శన టోకెన్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.