దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్!

  • ఉత్కంఠను రేకెత్తిస్తున్న దుబ్బాక ఎన్నికలు
  • నవంబర్ 10న వెలువడనున్న ఫలితాలు
  • బీజేపీ వైపు మొగ్గు చూపిన మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్
తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ నువ్వా, నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహించాయి. విజయం కోసం సర్వశక్తులను ఒడ్డాయి. టీఆర్ఎస్ తరపున సుజాత, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. నవంబర్ 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్:
తొలి స్థానం: బీజేపీ (51.82 శాతం)
రెండో స్థానం: టీఆర్ఎస్ (35.67 శాతం)
మూడో స్థానం: కాంగ్రెస్ (12.15 శాతం)

ఆరా ఎగ్జిట్ పోల్స్:
తొలి స్థానం: టీఆర్ఎస్ (48.72 శాతం)
రెండో స్థానం: బీజేపీ (44.64 శాతం)
మూడో స్థానం: కాంగ్రెస్ (6.12 శాతం)

థర్డ్ విజన్ రీజర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) ఎగ్జిట్ పోల్స్:
తొలి స్థానం: టీఆర్ఎస్ (51-54 శాతం)
రెండో స్థానం: బీజేపీ (33-36 శాతం)
మూడో స్థానం: కాంగ్రెస్ (8-11 శాతం)

పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్:
తొలి స్థానం: బీజేపీ (47 శాతం)
రెండో స్థానం: టీఆర్ఎస్ (38 శాతం)
మూడో స్థానం: కాంగ్రెస్ (13 శాతం).


More Telugu News