చిరంజీవి, నాగార్జునలతో భేటీ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ ను నిర్మించే ఆలోచన ఉంది
- 1500 నుంచి 2000 ఎకరాలను ప్రభుత్వమే సేకరిస్తుంది
- భూమిని సినిమా నిర్మాణ సంస్థలకు ఇస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో 'సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్'ను నిర్మిస్తామని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, విస్తరణకు హైదరాబాదులో ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు.
ఇందుకోసం 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వమే సేకరించి ఇస్తుందని చెప్పారు. అందులో అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యంతో స్టూడియోలను నిర్మించేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు. సినిమా సిటీకి ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
మరోవైపు చిరంజీవి, నాగార్జున మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగులను ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే థియేటర్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.