కర్ణాటక ఐఏఎస్ అధికారి నివాసంపై ఏసీబీ దాడులు
- ఐఏఎస్ అధికారిణి సుధపై అవినీతి ఆరోపణలు
- కన్నడ సినిమాలను నిర్మిస్తున్న సుధ భర్త
- సోదాలలో నగదు, ఆభరణాలు స్వాధీనం
కర్ణాటకలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకంగా ఐఏఎస్ అధికారిణి నివాసంపైనే దాడులు జరిపారు. కర్ణాటక ఇన్ఫర్మేషన్ మరియు బయోటెక్నాలజీ శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుధ ఇంట్లో ఈరోజు తనిఖీలను నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆమె నివాసం నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఆమె బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (బీడీఏ)లో ల్యాండ్ అక్విజిషన్ అధికారిగా పని చేశారు. ఆమె అవినీతిపై లోకాయుక్తలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆమె భర్త కన్నడ సినీ నిర్మాతగా ఉన్నారు. ఆమె అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఆయన సినిమాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా యలహంక, కొడిగహల్లి, మైసూరు, ఉడిపిలోని ఇళ్లపై ఏక కాలంలో అధికారులు దాడులు నిర్వహించారు.