బీహార్లో ముగిసిన పోలింగ్... ఈ నెల 10న ఫలితాలు
- బీహార్ లో నేడు చివరి దశ పోలింగ్
- 78 నియోజకవర్గాల్లో పోలింగ్
- సాయంత్రం 6 గంటల వరకు 54 శాతం ఓటింగ్
బీహార్ ఎన్నికల్లో నేడు చివరి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి 54.57 శాతం ఓటింగ్ నమోదైంది. బీహార్ లో అక్టోబరు 28న తొలి విడత, నవంబరు 3న రెండో విడత ఎన్నికలు జరిగాయి. ఇవాళ చివరిదైన మూడో దశలో 19 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
బీహార్ అసెంబ్లీ స్పీకర్ తో పాటు నితీశ్ కుమార్ క్యాబినెట్ లోని 12 మంది మంత్రులు ఇవాళ ఎన్నికల బరిలో ఉండడంతో అందరి దృష్టి చివరి దశ పోలింగ్ పై పడింది. బీహార్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా, అధికారం సాధించేందుకు కావాల్సిన స్థానాలు 122. ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.