రానున్న రోజుల్లో యుద్ధం అనేది సంక్లిష్టంగా మారబోతోంది: ఎయిర్ ఫోర్స్ చీఫ్ భదౌరియా

  • ఊహించని రీతిలో భద్రతాపరమైన చిక్కులు వస్తాయి   
  • సవాళ్లను ఎదుర్కోవడానికి బలగాలు సిద్ధంగా ఉండాలి
  • త్రివిధ దళాధిపతి వ్యవస్థను ఏర్పాటు చేయడం గొప్ప సంస్కరణ
రానున్న రోజుల్లో యుద్ధం మరింత సంక్లిష్టంగా మారబోతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ భదౌరియా అన్నారు. ఊహించని రీతిలో భద్రతాపరమైన చిక్కులు ఎక్కువవుతాయని చెప్పారు. అయితే ఎలాంటి రక్షణపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉండాలని అన్నారు.

 పూణెలో జరిగిన ఎన్డీఏ క్యాడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. త్రివిధ దళాధిపతి వ్యవస్థను ఏర్పాటు చేయడం భారత సైనిక చరిత్రలోనే ఒక గొప్ప సంస్కరణ అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం మన సరిహద్దుల్లో ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వేళలా అప్రమత్తంగా ఉంటూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు.


More Telugu News