ఏ ఆటగాడైనా అలా కొనసాగగలడా?: కోహ్లీపై గంభీర్ తీవ్ర వ్యాఖ్యలు

  • కోహ్లీ ఎనిమిదేళ్లుగా ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నాడు
  • ఇంత వరకు ఒకసారి కూడా టైటిల్ గెలవలేదు
  • ధోనీ, రోహిత్ లతో కోహ్లీని పోల్చలేం
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట ముగిసింది. హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన ఆర్సీబీ ఈ సీజన్ లో తన ప్రయాణాన్ని ముగించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల నుంచి ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని... ఇన్నేళ్లలో జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడని విమర్శించాడు. ఏ జట్టు కెప్టెన్ అయినా ఎనిమిదేళ్ల పాటు కప్పును గెలవకుండా అదే పొజిషన్ లో కొనసాగగలడా? అని ప్రశ్నించాడు.

ధోనీ, రోహిత్ శర్మలు ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్లని గంభీర్ అన్నాడు. వీరిద్దరి సరనన కోహ్లీని చేర్చలేమని చెప్పాడు. ఆర్సీబీ ఎక్కువగా కోహ్లీ, డీవిలియర్స్ ల పైనే ఆధారపడుతోందని తెలిపారు. ఆర్సీబీ పూర్తిగా విఫలం కాకుండా డీవిలియర్స్ కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. ఐపీఎల్ లో బలమైన జట్టుగా రాణించాలంటే... ఆటగాళ్లందరూ రాణించాల్సి ఉంటుందని చెప్పాడు. గెలిచినప్పుడు క్రెడిట్ పొందేవారు... ఓడినప్పుడు విమర్శలను కూడా స్వీకరించాలని అన్నాడు.


More Telugu News