అమెరికా అధ్యక్షుడిగా నా బాధ్యత ఇదే: జో బైడెన్
- యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా బాధ్యత
- అందరూ కోపతాపాలను పక్కన పెట్టాలి
- కరోనాను కట్టడి చేసేందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాం
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం దాదాపు ఖరారయిపోయింది. ఈ నేపథ్యంలో తన హోం టౌన్ విల్మింగ్టన్ లో కమలా హారిస్ తో కలసి ఆయన మాట్లాడుతూ... యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అధ్యక్షుడిగా తన బాధ్యత అని చెప్పారు.
ఇప్పుడు అందరూ కోపతాపాలను పక్కన పెట్టాలని అన్నారు. ఒక దేశంగా ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తొలి రోజునే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు యాక్షన్ ప్లాన్ ను అమల్లో పెడతామని తెలిపారు. మహమ్మారి వల్ల పోయిన ప్రాణాలను తీసుకురాలేమని... కానీ రాబోయే నెలల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.