ఉండవల్లి శ్రీదేవి నుంచి మమ్మల్ని సీఎం జగనే కాపాడాలి: వైసీపీ బహిష్కృత నేత సందీప్
- సందీప్, సురేశ్ లతో ప్రాణహాని ఉందంటూ శ్రీదేవి ఫిర్యాదు
- అజ్ఞాతంలోకి వెళ్లిన సందీప్
- సీఐ ధర్మేంద్ర, ఉండవల్లి శ్రీదేవితో తనకు ముప్పుందని వెల్లడి
తాడికొండ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సందీప్, సురేశ్ అనే వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ బహిష్కృత నేత సందీప్ తాజాగా ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే కారణంగా తనకు ప్రాణహాని ఉందని, తనను సీఎం జగనే కాపాడాలని అన్నారు.
ఉండవల్లి శ్రీదేవి అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవిలతో తనకు ముప్పు ఉందని, అక్రమ కేసుల కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. తన పరిస్థితి పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని, మరణం తప్ప తనకు మరోమార్గం లేదంటూ సందీప్ కన్నీటి పర్యంతమయ్యారు. ఉండవల్లి శ్రీదేవికి మొదటి నుంచి అండగా ఉన్నానని, పార్టీ కోసం ఎంతో శ్రమించానని తెలిపారు. ఇదిలావుంచితే, కొన్నిరోజుల కిందట సందీప్, సురేశ్ గుంటూరు మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిద్దరినీ పార్టీ సస్పెండ్ చేసింది.