ఆంధ్రప్రదేశ్ లోని కాపులకు దీపావళి కానుక.. 'కాపునేస్తం' నిధుల విడుదల
- 95,245 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు
- రూ. 142.87 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం
- అర్హులైన అందరికీ సాయాన్ని అందిస్తామన్న మంత్రి వేణు
కాపులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాపు నేస్తం పథకం లబ్ధిదారులకు రూ. 142.87 కోట్లను విడుదల చేసింది. లబ్ధిదారుల కొత్త జాబితా ప్రకారం అర్హులకు సాయాన్ని అందించనున్నారు. కొత్త జాబితా ప్రకారం 95,245 మందికి పథకాన్ని వర్తింపచేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ కాపు నేస్తం నిధులను అందిస్తామని చెప్పారు. కాపులకు జగన్ ఇస్తున్న దీపావళి కానుక ఇది అని అన్నారు. బాధల్లో ఉన్న వారిని చూసి చలించే మనస్తత్వం జగన్ దని చెప్పారు. పాదయాత్రలో ఎంతోమంది సమస్యలు విన్న జగన్ వాటన్నింటికి పరిష్కారాలను చూపిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకునే వ్యక్తి జగన్ అని... ఇచ్చిన హామీల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.