నాడు ఇచ్చిన మీ హామీలకు నేడు ఏం సమాధానం చెబుతారు?: దేవినేని ఉమ

  • 21 లక్షల ఇళ్లను గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది
  • 10 లక్షలకు పైగా పూర్తిచేసింది
  • 17 నెలలుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదు?
  • ఎన్నికల ముందు పూర్తిగా ఉచితంగా ఇస్తామన్నారు కదా?
అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు గుప్పించిన ఏపీ ముఖ్మంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్ల మంజూరు విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.

‘21 లక్షల ఇళ్లను తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరుచేసి 10 లక్షలకు పైగా పూర్తిచేస్తే, 17 నెలలుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికలముందు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, బ్యాంకులోను సహా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన మీమాటలకు నేడు ఏం సమాధానం చెబుతారు? అధికారంలోకి వచ్చాక ఎంతమంది పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చారు?’ అని దేవినేని ఉమ సర్కారును ప్రశ్నించారు.


More Telugu News