ఏమిటీ ఈ ఉత్సాహం అని ఆరా తీస్తే, అందులో ఎక్కువ శాతం అస్మదీయులటా!: వర్ల రామయ్య
- ఎన్నడూ లేనివిధంగా 55 మంది మహిళా ఖైదీల విడుదల
- ఖైదీలన్నా, జైలన్నా ప్రభుత్వానికి ఎక్కువ మక్కువ
- కారణం? అస్మదీయులన్న అభిమానమా? మరేదైనానా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. 55 మంది మహిళా ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, అందుకు కారణం ఏంటని ఆయన నిలదీశారు.
‘గతంలో ఎన్నడూ లేనివిధంగా 55 మంది మహిళా ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏమిటీ ఈ ఉత్సాహం అని ఆరా తీస్తే, అందులో ఎక్కువ శాతం అస్మదీయులటా! ఖైదీలన్నా, జైలన్నా, కోర్టులన్నా, కేసులన్నా, ముద్దాయిలన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపుతోంది. కారణం? అస్మదీయులన్న అభిమానమా? మరేదైనానా?’ అని వర్ల రామయ్య సెటైర్లు వేశారు.
కాగా, మహిళలు జైళ్లకు వెళ్లడం వల్ల వారి కుటుంబం నాశనం అవుతుందని, అందుకే ఐదేళ్లు పైబడి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మానవత్వంతో విడుదల చేస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత నిన్న ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 147 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలున్నారని, వారిలో 55 మందిని ప్రస్తుతం విడుదల చేయబోతున్నామని వివరించారు.