హైదరాబాద్‌లోని పలు పబ్‌లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు!

  • లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెరచుకున్న పబ్‌లు 
  • కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం
  • తబులారస, ఎయిర్‌లైవ్, కెమిస్ట్రీ, అమ్నీషియా పబ్‌లపై కేసులు
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా పబ్‌లు తెరుచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కరోనా నిబంధనలు పాటించకుండా వాటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో యువత పెద్ద సంఖ్యలో పబ్‌లకు తరలి వస్తుండడంతో కరోనా విజృంభణకు అవకాశం ఇస్తున్నట్లు అవుతోంది. హైదరాబాద్‌లోని పబ్‌లలో కరోనా నిబంధనలు పాటించడం లేదని సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లపై దాడులు చేసి, చర్యలు తీసుకున్నారు.

తబులారస, ఎయిర్‌లైవ్, కెమిస్ట్రీ, అమ్నీషియా పబ్‌లపై కేసులు నమోదు చేశారు. వాటి యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండానే డ్యాన్స్ ఫ్లోర్‌ను తెరిచినట్లు గుర్తించారు. యువత మాస్కులు లేకుండానే పబ్బులోకి ప్రవేశించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు.  పబ్‌లలో కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.


More Telugu News