దివ్యతేజస్విని హత్య కేసులో నాగేంద్రబాబు అరెస్ట్.. నేడు కోర్టుకు!

  • గత నెల 15న తేజస్విని హత్య
  • 22 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న నిందితుడు
  • పోలీసులు కస్టడీ కోరే అవకాశం
విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్యతేజస్విని హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నాగేంద్రబాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 15న తేజస్వినిని ఆమె ఇంట్లోనే కత్తితో పొడిచి నాగేంద్రబాబు హత్య చేశాడు. అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 22 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న నాగేంద్రబాబును నిన్న మధ్యాహ్నం వైద్యులు డిశ్చార్జ్ చేయగా, ప్రత్యేక వాహనంలో పోలీసులు విజయవాడ తరలించారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు 24 గంటల సమయం ఉండడంతో దిశ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు కొన్ని పేర్లు వెల్లడించాడని, వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడిని నేడు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది.


More Telugu News