తలసాని మనవడికి కేటీఆర్ పేరు పెట్టుకోవడంపై రేవంత్ రెడ్డి విమర్శలు
- తలసానికి సిగ్గు, శరం ఉండాలంటూ విసుర్లు
- ఎవరైనా మహనీయుల పేర్లు పెట్టుకుంటారని వెల్లడి
- రోడ్లపై జులాయిగా తిరిగే కేటీఆర్ పేరు ఎలా పెట్టుకున్నావంటూ వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తలసాని మనవడికి మంత్రి కేటీఆర్ పేరు పెట్టుకోవడం పట్ల రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పేరు పెట్టుకుంటే మహాత్మాగాంధీ, అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే, ఛత్రపతి వంటి మహనీయుల పేర్లు, లేక ఎవరైనా ధన్యజీవుల పేర్లు పెట్టుకుంటారని అన్నారు. అదీ కాకపోతే కుటుంబంలో పెద్దల పేర్లు పెట్టుకుంటారని తెలిపారు.
'కానీ, రోడ్లపై జులాయిగా తిరుగుతూ, జూబ్లీహిల్స్ లో గెస్ట్ హౌస్ ల్లో పడుకునే మంత్రి కేటీఆర్ పేరు మనవడికి పెట్టుకుంటావా? సిగ్గు, శరం ఉండాలి!' అంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఇంత సిగ్గు, లజ్జ లేని శ్రీనివాస్ యాదవ్ నువ్వా మా గురించి మాట్లాడేదని' నిలదీశారు.
బీసీల ఆత్మగౌరవాన్ని తలసాని మంత్రి కేటీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ విమర్శించారు. అభినవ అంబేద్కర్, అభినవ జ్యోతిరావ్ పూలే అంటూ కేటీఆర్ భజన చేస్తున్న తలసాని అన్నీ తలకు మాసిన మాటలు చెబుతున్నాడని రేవంత్ వ్యాఖ్యానించారు.