శ్రీకాకుళం జిల్లాలో బైక్ ను చుట్టేసిన కింగ్ కోబ్రా... హడలిపోయిన స్థానికులు!
- కంచిలి మండలం పోలేరులో రాచనాగు కలకలం
- చాకచక్యంగా పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్
- 10 అడుగుల పైగా పొడవున్న పాము
ఏజెన్సీ ప్రాంతంలో కింగ్ కోబ్రాలు అత్యధికంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ రాచనాగు శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం పోలేరు గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన బైక్ ను చుట్టేసింది. 10 అడుగులకు పైగా పొడవున్న ఈ భారీ కింగ్ కోబ్రాను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి ఎంతో నైపుణ్యంతో పామును బైక్ నుంచి బయటికి తీసి, ఆపై దాన్ని ప్రదర్శించాడు. ప్రజలు అంత పెద్ద పామును ఎంతో ఆశ్చర్యంతో తిలకించారు. ఈ పామును బొగబెణి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.