మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నివాసంలో కరోనా కలకలం

  • గంభీర్ నివాసంలో ఒకరికి పాజిటివ్
  • ఐసోలేషన్ లోకి వెళ్లిన గంభీర్
  • టెస్ట్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్నానంటూ ట్వీట్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నివాసంలోనూ కరోనా కలకలం రేగింది. గంభీర్ ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో తాను ఐసోలేషన్ లోకి వెళుతున్నట్టు గంభీర్ ప్రకటించారు. ప్రస్తుతం తాను కూడా కరోనా పరీక్షకు నమూనాలు పంపానని, మెడికల్ రిపోర్టు కోసం వేచి చూస్తున్నానని వెల్లడించారు.

కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని గంభీర్ సోషల్ మీడియాలో సూచించారు. కొన్ని వారాల కిందట ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపించినా, ఇటీవల మళ్లీ కరోనా ఉద్ధృతి మొదలైంది. నిత్యం 6 వేల వరకు కేసులు వస్తున్నాయి.


More Telugu News