పుతిన్ పై 37 ఏళ్ల ప్రియురాలు, ఇద్దరు కుమార్తెల ఒత్తిడి?

  • అధ్యక్ష బాధ్యతల నుంచి పుతిన్ తప్పుకోబోతున్నారని వార్తలు
  • జనవరిలో అధికారిక ప్రకటన చేస్తారన్న మాస్కో రాజకీయ విశ్లేషకుడు
  • పుతిన్ వేళ్లు మెలితిరిగినట్టుగా ఉంటున్నాయన్న నిపుణులు
వచ్చే ఏడాది జనవరిలో రష్యా అధ్యక్ష పదవి నుంచి వ్లాదిమిర్ పుతిన్ దిగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్కిన్సన్స్ (వణుకుడు జబ్బు)తో పుతిన్ బాధపడుతున్నారని... అందుకే అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నారనేది ఆ వార్తల సారాంశం.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం... అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలని పుతిన్ పై ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. పుతిన్ ఇద్దరు కుమార్తెలతో పాటు, ఆయన 37 ఏళ్ల ప్రియురాలు అలీనా కబేవా కూడా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పట్టుబట్టారు. ఈ విషయాలను మాస్కో పొలిటికల్ సైంటిస్ట్ వలేరీ సొలోవీ తెలిపారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

పుతిన్ పై ఆయన కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సొలోవీ తెలిపారు. తన రిటైర్మెంట్ ను జనవరిలో అధికారికంగా పుతిన్ ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

గత కొంత కాలంగా పుతిన్ లో పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. పుతిన్ బాడీ లాంగ్వేజ్ ఫుటేజీని పరిశీలించిన నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. పుతిన్ కాళ్లు కంటిన్యూయస్ గా కదులుతున్నాయని, కుర్చీ ఆర్మ్ రెస్ట్ పై చేతిని ఉంచేటప్పుడు ఆయన నొప్పికి గురవుతున్నారని చెప్పారు. పెన్నును కానీ, కాఫీ కప్పును కానీ పట్టుకున్నప్పుడు ఆయన వేళ్లు మెలి తిప్పినట్టు కనపడుతున్నాయిని తెలిపారు. మరోవైపు పదవీ బాధ్యతల నుంచి పుతిన్ తప్పుకోనున్నారనే వార్తలను అధ్యక్ష కార్యాలయ సిబ్బంది ఖండించారు.


More Telugu News