నితీశ్ చేసిన ఆ వ్యాఖ్యతో ఓటమిని ఒప్పుకున్నారని స్పష్టమవుతోంది: చిదంబరం
- ఇవే తన చివరి ఎన్నికలని నితీశ్ ప్రకటించారు
- పాలనను ప్రజలు ఆదరిస్తే ఆయన అలా వ్యాఖ్యలు చేయరు
- తనకు చివరి ఎన్నికలని అనడంలో కుట్ర ఉంది
- పని ఆధారంగా ఓట్లు వేయాలని నితీశ్ కుమార్ కోరట్లేదు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇవే తన చివరి ఎన్నికలు అని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. అలా వ్యాఖ్యానించడం ద్వారా నితీశ్ కుమార్ తన ఓటమిని అంగీకరించారని, ఆయన పాలనను ప్రజలు ఆదరిస్తే ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
తనకు చివరి ఎన్నికలు అని నితీశ్ అనడంలో కుట్ర ఉందని తెలిపారు. తన పని ఆధారంగా ప్రజలను ఓట్లు వేయాలని నితీశ్ కుమార్ కోరడం లేదని, ఆయన బీహార్‌ను అభివృద్ధి చేయలేదని అన్నారు. దీంతో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. కాగా, తాను అలసిపోయినట్టు, ఓడిపోతానని నితీశ్‌కుమార్‌కు అర్థమైందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా విమర్శించారు.