'చిల్ డొనాల్డ్...' అంటూ సెటైర్ వేసి, ప్రతీకారం తీర్చుకున్న 17 ఏళ్ల గ్రెటా థన్ బెర్గ్!
- గతంలో గ్రెటాపై ట్రంప్ సెటైర్లు
- 11 నెలల తరువాత గ్రెటాకు అవకాశం
- ఓడిపోతున్న ట్రంప్ పై సెటైర్లు
స్వీడన్ కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బెర్గ్ కు 11 నెలల తరువాత ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం వచ్చింది. అధ్యక్ష పీఠాన్ని వదులుకోవాల్సిన సమయం దగ్గరపడిన నేపథ్యంలో, "చిల్ డొనాల్డ్ చిల్..." అంటూ ఆమె ట్వీట్ చేస్తూ, గతంలో తనపై వేసిన సెటైర్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది.
వీరిద్దరి మధ్యా ఇంతకీ ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే, పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్న గ్రెటాను గతంలో టైమ్ మేగజైన్, ఇయర్ ఆఫ్ ది పర్సన్ పేరిట సత్కరించింది. ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ, "చిల్ గ్రెటా..." అంటూ ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. ఆపై 2019లో మరోసారి గ్రెటాను టార్గెట్ చేస్తూ, "చాలా హాస్యాస్పదంగా ఉంది. గ్రెటా కోపాన్ని తగ్గించుకోవాలి. యాంగర్ మేనేజ్ మెంట్ పై పనిచేయాలి. నీ స్నేహితుడితో కలిసి మంచి సినిమాకు వెళ్లు" అంటూ వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలతో గ్రెటా మనసు నొచ్చుకుందేమో, 11 నెలల తరువాత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతున్న సమయాన్ని చూసి కౌంటర్ వేశారు. గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలనే ఆమె ట్రీట్ చేశారు. స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లాలని, కోపాన్ని తగ్గించుకోవాలని సూచించారు. దీంతో ఇప్పటికే ట్రంప్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న వారంతా, గ్రెటా ట్వీట్ ను మరింత వైరల్ చేస్తూ, వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.