అది ఆయన సొంత విషయం: నటుడు విజయ్ సొంతపార్టీ వార్తలపై సీఎం పళనిస్వామి
- పార్టీ పెట్టడం అనేది ఆయన సొంత విషయం
- దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు
- విజయ్ పార్టీ పెట్టినా మాకొచ్చే నష్టమేమీ లేదు
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేశాడంటూ నిన్నటి నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వార్తలను నటుడు విజయ్ ఖండించాడు. తానేమీ పార్టీ పెట్టడం లేదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాడు. పార్టీ కోసం తన తండ్రి దరఖాస్తు చేశారని, దానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పాడు.
అంతేకాదు, ఆ పార్టీ కోసం తన ఫొటోలు కానీ, పోస్టర్లు కానీ వాడుకోవద్దని కుండబద్దలుకొట్టాడు. కాగా, విజయ్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి స్పందించారు. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, వారికి ఆ హక్కు ఉందని అన్నారు. ఇక, విజయ్ పార్టీ పెట్టడం అనేది పూర్తిగా ఆయన సొంత విషయమని సీఎం పేర్కొన్నారు. ఆయన పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.