మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు.. వాటిని చూపించి బ్లాక్‌మెయిల్!
- బాధిత మహిళ ఫిర్యాదుతో అరెస్ట్
- బెయిలుపై వచ్చి బాధిత కుటుంబంపై దాడి
- నిందితుడికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గ్రామస్థుల ఆందోళన
మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీసి ఆపై వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తికి పోలీసులు అండగా నిలుస్తున్నారంటూ బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని లాల్‌సింగ్ తండాలో జరిగిందీ ఘటన. అమ్మాయిులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడు శ్రీనివాస్, అక్కడితో ఆగక వాటిని తన స్నేహితులకు కూడా పంపుతున్నాడు.
గత నెల 18న ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం బెయిలుపై విడుదలైన నిందితుడు తన సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాక, వారిపైనే తిరిగి కేసులు పెట్టించాడు.
తమను వేధింపులకు గురిచేయడమే కాకుండా తమపైనే తిరిగి కేసులు పెట్టించడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును పట్టించుకోకుండా, తిరిగి నిందితుడికే పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అతడి వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.