ఐపీఎల్ లో నేడు క్వాలిఫయర్-1... ముంబయిపై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- నేటి నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్
- క్వాలిఫయర్-1లో ముంబయి వర్సెస్ ఢిల్లీ
- బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- దుబాయ్ వేదికగా కీలక మ్యాచ్
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ టోర్నీ ప్లేఆఫ్స్ దశలోకి ప్రవేశించింది. నేడు క్వాలిఫయర్-1లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి దూసుకెళుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది.
ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే... పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్, రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ జట్ల మధ్య జరుగుతోంది. ఈ పోరు కోసం ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ముంబయి జట్టులో మాత్రం మూడు మార్పులు జరిగాయి. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య మళ్లీ జట్టులోకి వచ్చారు. పాటిన్సన్, ధవళ్ కులకర్ణి, సౌరభ్ తివారీలకు ఉద్వాసన పలికారు.