లవ్ జిహాద్ ను అంతం చేస్తాం: కర్ణాటక హోం మంత్రి బసవరాజ్

  • లవ్ జిహాద్ ను అరికట్టేందుకు కొత్త చట్టాలు అవసరం
  • న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం
  • ప్రేమ పేరుతో మత మార్పిడి చేయడం దారుణం
లవ్ జిహాద్ అనేది సమాజానికి చెడు కలిగించే అంశమని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మాయ్ అన్నారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. లవ్ జిహాద్ ను అరికట్టేందుకు కొత్త చట్టాలు అవసరమని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్, హర్యాణా, మధ్యప్రదేశ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ దీన్ని అరికట్టేందుకు తీసుకురావాల్సిన చట్టాలపై ఆలోచిస్తున్నాయని తెలిపారు. న్యాయ నిపుణులు ఇచ్చే సలహాలను అనుసరించి తదుపరి కార్యాచరణను చేపడతామని అన్నారు. ప్రేమ పేరుతో లవ్ జిహాద్ లోకి దించి, ఆ తర్వాత మత మార్పిడి చేయడం దారుణమని చెప్పారు.

మరోవైపు ఇదే అంశంపై కర్ణాటక బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి మాట్లాడుతూ, పెళ్లి కోసం మతం మారడాన్ని అంగీకరించలేమంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. మత మార్పిడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.


More Telugu News