అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అచ్చం ఆయన చెప్పింది చెప్పినట్లే జరుగుతోంది.. వీడియో వైరల్
- 2 వారాల క్రితం డెమోక్రటిక్ సెనేటర్ బెర్నీ సాండర్స్ వ్యాఖ్యలు
- మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని జోస్యం
- మొదట ట్రంప్ 2 రాష్ట్రాల్లో విజయం సాధిస్తారని వ్యాఖ్య
- తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతారన్న బెర్నీ
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అన్న విషయం దాదాపు తేలిపోయింది. డెమోక్రటిక్ అభ్యర్థి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే దిశగా ఫలితాలు వస్తున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు 270 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థి అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న విషయం తెలిసిందే. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూడడంతో రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చొనే అవకాశానికి దాదాపు దూరమయ్యారు.
మరో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఫలితాలు రావాల్సి ఉంది. తక్కువ మెజార్టీతో జో బైడెన్ గెలిచే అవకాశాలు ఉండడంతో కోర్టులకు వెళ్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. డెమోక్రటిక్ సెనేటర్ బెర్నీ సాండర్స్ రెండు వారాల క్రితం అమెరికా ఎన్నికల గురించి మాట్లాడారు.
ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కౌంటింగ్ సమయంలో చోటు చేసుకునే పరిణామాలు, ట్రంప్ ఎలా స్పందిస్తారన్న అంశాల గురించి ఆయన జోస్యం చెప్పారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని ఆయన ఇటీవల అన్నారు.
దీంతో కౌంటింగ్ ప్రక్రియ ముగియడానికి ఆలస్యం అవుతుందని అన్నారు. పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ మొత్తంలో నమోదవుతాయని చెప్పారు. ఫ్లోరిడా లేక వెర్మోంట్ వంటి రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఇతర కారణాల వల్ల ఎన్నికల రోజు వెంటనే ఆ బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించలేరని తెలిపారు. దీంతో మిలియన్ల కొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లు ఉండబోతున్నాయని చెప్పారు.
డెమోక్రట్లు ఎక్కువగా మెయిల్ ఇన్ బ్యాలెట్స్ని వినియోగించుకుంటారని అన్నారు. అయితే, రిపబ్లికన్లు మాత్రం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారని అన్నారు. ఎన్నికలు జరిగే నాడు రాత్రి 10 గంటలకు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో విజయం సాధిస్తారని అన్నారు. దీంతో ఆయన ఉప్పొంగిపోయి తనను మరో సారి ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలని అంటారని, ఇక అంతా ముగిసిందని, ఇదొక మంచి రోజని అంటారని బెర్నీ అన్నారు. ఆ తర్వాత ఫలితాలు మరోలా ఉంటాయని చెప్పారు. అచ్చం ఆయన చెప్పినట్లే అమెరికా ఎన్నికల ఫలితాలు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.