సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
- రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
- ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోద ముద్ర వేయనున్న కేబినెట్
- శాసన సభ సమావేశాల తేదీల నిర్ణయంపై చర్చ
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఏపీలో చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోద ముద్ర వేయడంతో పాటు శాసన సభ సమావేశాల తేదీల నిర్ణయం వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.
ఉచిత బియ్యం డోర్ డెలివరీ, కొత్త ఇసుక విధానంపై మార్పులు, ఏపీలో భూముల రీసర్వే, విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌పై కూడా చర్చించనున్నారు.