అర్నాబ్ గోస్వామికి 14 రోజుల రిమాండ్.. భౌతిక దాడి ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు

  • ఆర్కిటెక్చర్ అన్వయ్, అతడి తల్లి ఆత్మహత్య కేసులో అర్నాబ్ అరెస్ట్
  • బాధిత కుటుంబం అభ్యర్థనతో కేసును రీ ఓపెన్ చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం
  • నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం
ఆర్కిటెక్చర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామికి కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేయగా, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో తిరిగి తెరచిన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నిన్న ఉదయం గోస్వామిని అరెస్ట్ చేసింది. అర్నాబ్‌ను రెండు వారాలపాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించిన అలీబాగ్ కోర్టు.. అరెస్ట్ సమయంలో తనపై పోలీసులు భౌతికదాడికి దిగారన్న అర్నాబ్ ఆరోపణలను కూడా తోసిపుచ్చింది.

అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది. అయితే, అర్నాబ్ మాత్రం పోలీసులు తనపై దాడిచేసినట్టు ఆరోపిస్తున్నారు. కాగా, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా అర్నాబ్ పెట్టుకున్న పిటిషన్‌ను నేడు బాంబే హైకోర్టు విచారించనుంది. అలాగే, బెయిలు కోసం కూడా ఆయన దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.


More Telugu News