సీల్ పాడుకాకుండా మద్యం కల్తీ... హైదరాబాద్ లో జరిగే దందా వీడియో ఇదిగో!
- హైదరాబాద్ లో ఘటన
- నిందితుల గుర్తింపు
- కేసును రిజిస్టర్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
హైదరాబాద్ లో మద్యం ఎలా కల్తీ అవుతుందన్న విషయమై, వాట్స్ యాప్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది తెలంగాణ ఎక్సయిజ్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. విస్కీ బాటిల్స్ ను సీల్ తీయకుండా మూతను తీయడం, ఆపై దానిలోని మద్యాన్ని వేరే బాటిల్ లోకి మార్చి, సగం నీరు నింపి, ఏ మాత్రమూ అనుమానం రాకుండా తిరిగి సీల్ వేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
మద్యాన్ని డెలివరీ చేసే ఓ ట్రక్ లో ఉన్న ఇద్దరు ఈ దందాను సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ విభాగం ఓ కేసును రిజిస్టర్ చేసి, విచారణను ప్రారంభించింది. అధికారుల అంచనా ప్రకారం, ఈ వీడియో మంగళవారం నాడు తొలిసారిగా వాట్స్ యాప్ లో కనిపించింది. తమను వీడియో తీస్తున్నారని వాహనంలోని వారికి తెలుసు. తామేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా వారు ప్రవర్తించారు.
విచారణ జరిపిన అధికారులు, వీరిలో ఒకర్ని ఘట్ కేసర్ కు చెందిన రెడ్డిపోయిన సాయి, మరొకర్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన రాంబాబుగా గుర్తించామని తెలిపారు. ఈ ట్రక్ కూడా రెడ్డిదేనని, అతనే డ్రైవర్ గా వచ్చాడని, బాటిల్స్ లో మద్యాన్ని కల్తీ చేస్తుంటే రాంబాబు సహకరించాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.