అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీపీఎం
- సీపీఎం కార్యదర్శి మధు పేరుతో అఫిడవిట్
- కేంద్రం అలా చెప్పడం సరికాదన్న మధు
- రైతుల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్న
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో సీపీఎం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేరుతో ఈ కౌంటర్ దాఖలైంది. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు. రాజధాని విషయంతో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం సరికాదని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ. 2,500 కోట్లు ఎందుకిచ్చిందని ప్రశ్నించారు.
అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే వేల కోట్లను ఖర్చు చేశారని... ఇలాంటి నేపథ్యంలో, రాజధాని మార్పు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. రాజధానిని తరలిస్తే భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏం కావాలని అన్నారు. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని విమర్శించారు. రాజధాని తరలింపు రాష్ట్ర అభివృద్ధికి విరుద్ధమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని జగన్ సమర్థించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సరికాదని అన్నారు.