హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు మోదీ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది: అమిత్ షా
- సట్లెజ్ నదిపై 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
- రూ. 1,810 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం
- ప్రాజెక్టు వల్ల ఏడాదికి 758.20 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
హిమాచల్ ప్రదేశ్ లో సట్లెజ్ నదిపై 210 మెగావాట్ల లూహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదముద్ర వేసింది. రూ. 1,810 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇదని అన్నారు. ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి 758.20 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు.