ట్రంప్, బైడెన్ మధ్య దోబూచులాడుతున్న విజయం.. పెరిగిన ఉత్కంఠ

  • కొనసాగుతోన్న కౌంటింగ్‌
  • జో బైడెన్ కు 224 ఎలక్టోరల్ ఓట్లు
  • ట్రంప్‌కు 213 ఓట్లు
  • విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం  
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతోన్న ట్రంప్, బైడెన్ మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జోబైడెన్ 224 ఎలక్టోరల్ ఓట్లతో ముందుండగా, ట్రంప్‌ 213 ఓట్లతో కొనసాగుతున్నారు. 270  ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తే వారు విజయం సాధిస్తారు. ఇద్దరి మధ్య తేడా స్వల్పంగానే ఉండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

మరోవైపు ట్రంప్, బైడెన్ ఇద్దరూ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మనం గెలుపు దిశగా పయనిస్తున్నాం’ అని జో బైడెన్ అన్నారు. తామే గెలుస్తామని, ఈ రోజు రాత్రి ఓ ప్రకటన చేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన ఫలితాలకు భిన్నంగా ఈ ఫలితాలు వస్తున్నాయి.


More Telugu News