అర్నాబ్ గోస్వామి అరెస్టుపై అమిత్ షా స్పందన
- కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కించపర్చాయి
- రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు
- ఇది స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుంది
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాలు మరోసారి ప్రజాస్వామ్యాన్ని కించపర్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేస్తూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడం మీడియాతో పాటు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
‘పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ ఘటన దేశంలో ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని, మీడియా పట్ల ఇటువంటి వైఖరి సరైంది కాదని చెప్పారు. మరోపక్క అర్నాబ్ గోస్వామి అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండిస్తూ ప్రకటన చేసింది. ఆయనపై దురుసుగా వ్యవహరించొద్దని పేర్కొంది.
అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ... తగిన ఆధారాలు ఉంటే ఎవరిపైన అయినా సరే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.