తేజస్వి యాదవ్ ర్యాలీకి భారీ జనం... 360 డిగ్రీలు తిరిగిన కెమెరా వ్యూ!

  • మూడవ దశ పోలింగ్ నేపథ్యంలో ర్యాలీ
  • 10న వెలువడనున్న ఫలితాలు
  • తేజస్వీ పోస్ట్ చేయగా వీడియో వైరల్
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనివుంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగియగా, మరో దశ పోలింగ్ తరువాత 10న ఫలితాలు వెలువడనున్నాయి. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి, నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్, ఇటీవల త్రివేణీ గంజ్ లో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో ఒకటి ఆశ్చర్య పరుస్తోంది.

తేజస్వీ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరాగా, జనసందోహాన్ని ఒకే ఫ్రేమ్ లో చూపించేందుకు కెమెరాను 360 డిగ్రీలు తిప్పారు. ఈ వీడియోను తేజస్వి, తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, జన ప్రవాహాన్ని కెమెరాలో బంధించేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఈ వీడియో బాలీవుడ్ నటుడు మనోజ్ యాదవ్ ను ఆశ్చర్య పరిచింది. బీహార్ ప్రజల అవస్థలు, యువతకు ఉద్యోగాలు లభించడం లేదని, రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారని ఈ జనాలను చూస్తుంటే తెలుస్తోందని కామెంట్ చేశారు.



More Telugu News