ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ కు బానిస: మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్

  • ఇమ్రాన్ కొకైన్ తీసుకోవడం చాలా సార్లు చూశాను
  • అప్పట్లో క్రికెట్ ఆడిన మరికొందరికి కూడా ఈ విషయం తెలుసు
  • లండన్ కు వెళ్లినప్పుడు డ్రగ్స్ ఎక్కువగా వాడేవాడు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తున్నట్టుంది. నలువైపుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుల్వామా ఘటన వెనుక పాక్ హస్తం ఉందని ఆ దేశ మంత్రి పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉగ్రవాదంతో పాకిస్తాన్ కు సంబంధాలు ఉన్నాయనే విషయం అంతర్జాతీయ సమాజానికి అర్థమైంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఇమ్రాన్ పై ఆయన సహచర క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ కు బానిస అని అన్నారు. 1987లో ఇంగ్లండ్ తో మ్యాచ్ పూర్తైన తర్వాత ఇస్లామాబాద్ వచ్చాక డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. అంతకు ముందు కూడా ఇమ్రాన్ కొకైన్ తీసుకోవడం చాలా సార్లు చూశానని తెలిపారు. ఈ విషయం తనతో పాటు అప్పట్లో క్రికెట్ ఆడిన మరికొందరికి కూడా తెలుసని చెప్పారు. ఇమ్రాన్ ను తన ముందుకు తీసుకొస్తే ఆ విషయాన్ని నిరూపిస్తానని అన్నారు. లండన్ టూర్ కి వెళ్లినప్పుడు కూడా ఇమ్రాన్ డ్రగ్స్ ఎక్కువగా తీసుకునేవాడని చెప్పారు.


More Telugu News