ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు 21,672 మాత్రమే!
- ఏపీలో నెమ్మదించిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 84,534 కరోనా టెస్టులు
- 2,849 మందికి పాజిటివ్
- 15 మంది మృతి
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. గత కొన్ని వారాలుగా ఏపీలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య ఏమంత ఆందోళన కలిగించే స్థాయిలో లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21,672 మాత్రమే. రికవరీ రేటు అధికంగా ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.
తాజా బులెటిన్ వివరాలు చూస్తే... గడచిన 24 గంటల్లో 84,534 కరోనా టెస్టులు నిర్వహించగా, కొత్తగా 2,849 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 436, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు వచ్చాయి. అదే సమయంలో 3,700 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,30,731 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,02,325 మంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 6,734కి పెరిగింది.