జగన్ అంటే ఒక చరిత్ర: మోపిదేవి వెంకటరమణ
- గతంలో నాలుగు బీసీ కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది
- జగన్ అన్ని బీసీ కులాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు
- ప్రజల స్థితి గతులను జగన్ కళ్లారా చూశారు
బీసీల కోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతో చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గత ప్రభుత్వాలు బీసీల్లోని నాలుగు కులాలకే ప్రాధాన్యతను ఇచ్చేవని... పదవులన్నీ ఆ నాలుగు బీసీ కులాలకు దక్కేవని చెప్పారు.
జగన్ మాత్రం బీసీల్లోని అన్ని కులాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు కేవలం ఓటు బ్యాంకుగానే ఉన్న బీసీలు... జగన్ నేతృత్వంలో రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారని చెప్పారు. గుంటూరులో ఈరోజు 'జయహో జగనన్న' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్ర సందర్భంగా ప్రజల స్థితిగతులను జగన్ కళ్లారా చూశారని మోపిదేవి చెప్పారు. రాజకీయ అరంగేట్రం నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగన్ ది ఒక చరిత్ర అని అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, సభ్యులు అందరూ జగన్ ఆశయాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. మీకు ఇచ్చిన పదవులు కేవలం విజిటింగ్ కార్డులకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు.